Sep 03,2023 00:48
నినాదాలు చేస్తున్న కార్మికులు

ప్రజాశక్తి-రోలుగుంట:ముఠా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో శనివారం రోలుగుంటలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఈరెల్లి చిరంజీవి మాట్లాడుతూ, నర్సీపట్నం డివిజన్‌లో వివిధ రకాలుగా రోజు పనిచేస్తున్న ముఠా కార్మికులు సుమారు 1000 మంది వరకు ఉన్నారని తెలిపారు. కార్మికుల వల్ల, వ్యాపారుల నుంచి వేల కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం వస్తుందన్నారు. తక్షణమే ముఠా కార్మికులకు భీమా సౌకర్యం కల్పించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, సమగ్ర చట్టం చేయాలని, కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ముఠా కార్మికులు కృష్ణ, ఈశ్వరరావు పాల్గొన్నారు.