ప్రజాశక్తి-కొయ్యూరు
తమ సమస్యలను పరిష్కరించాలని మధ్యాహ్నం భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన సోమవారం ఎంఇఒ కార్యాలయ డేటా ఎంట్రీ జ్యోతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు వై.అప్పలనాయుడు, ఎస్ సూరిబాబు మాట్లాడుతూ మిడ్డేమీల్స్ పథకంలో పనిచేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించి కనీసవేతనాలు ఇవ్వాలని, 5వ తేదీ లోపు వేతనాలు, బిల్లులు చెల్లించాలని, మెనూ ఛార్జీలు రోజుకు రూ.20కు పెంచాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేశారు. మార్చిన మెనూలో హాట్ పొంగలి, సాంబార్ బాత్, తొలగించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చెయ్యాలి, వంట షెడ్లు, వాటర్, కనీస సదుపాయాలు కల్పించాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, పింఛను ఇవ్వాలని, యూనిఫామ్ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మిడ్డేమీల్స్ కార్మికులు మేడా కన్నయ్యమ్మ, పాంగి రమణమ్మ పాల్గొన్నారు.










