Nov 07,2022 23:49

కమిషనర్‌కు వినతిపత్రం అందిస్తున్న కార్పొరేటర్‌ పిళ్లా మంగమ్మ

ప్రజాశక్తి -మధురవాడ : జివిఎంసి 7వ వార్డు పరిధిలోని దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కమిషనర్‌ రాజాబాబుకు వార్డు కార్పొరేటర్‌ పిళ్ళా మంగమ్మ వినతిపత్రం అందించారు. వార్డులోని వాంబే కాలనీలో ప్రధానంగా భూగర్భ డ్రెయినేజీ సమస్య, బాపూజీ నగర్‌లో తాగునీటి సమస్య, మురుగు పోయే మార్గం లేదని వివరించారు. మిధిలాపులి ఉడా కాలనీలో మురుగు నీరు పోయే మార్గం పనులను ప్రారంభించినా ముందుకు సాగలేదని తెలిపారు. నగరంపాలెం మాస్టర్‌ ప్లాన్‌ రహదారి పనులు మూడేళ్ల కిందట ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. వీటిపై దృష్టి సారించి వార్డు అభివృద్ధికి కృషిచేయాలని కమిషనర్‌ను కోరారు.