ప్రజాశక్తి -భీమునిపట్నం : జివిఎంసి మూడో వార్డు పరిధిలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జోనల్ కమిషనర్ ఎస్ వెంకటరమణకు వార్డు కార్పొరేటర్ గంటా అప్పలకొండ మంగళవారం వినతిపత్రం అందజేశారు. స్థానిక బీచ్‌లో ప్రమాదాలు జరగ కుండా లైఫ్ గార్డులను నియమించాలని, ఎగువపేట బీచ్‌లో మత్స్య కారుల వలల మరమ్మతుల కోసం నిర్మించిన షెడ్డును పునరుద్ధరించాలని కోరారు. ఇక్కడున్న ఓపెన్ జిమ్‌లో పాడైన వ్యాయామ పరికరాల స్థానంలో కొత్తవి అమార్చాలని, పలు ప్రాంతాల్లో ఐ మాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలని, సామాజిక భవనాలకు మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తిచేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, టిడిపి నాయకులు ఎం.సంజీవకుమార్, కనకల అప్పలనాయుడు, కొక్కిరి అప్పన్న, గండిబోయిన పోలిరాజు, వియ్యపు పోతురాజు తదితరులు ఉన్నారు.










