జెడ్‌సి వినతిపత్రం ఇస్తున్న టిడిపి నేతలు
ప్రజాశక్తి -భీమునిపట్నం: మూడో వార్డుóలో నెలకొన్న అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం జోనల్ కార్యాలయంలో జెడ్‌సి ఎస్ వెంకటరమణకు వార్డు కార్పొరేటర్ గంటా అప్పలకొండ వినతిపత్రం అందజేశారు. వర్షం కురిస్తే బీచ్ రోడ్డులోని ఉమర్ అలీషా ఆశ్రమం వద్ద రోడ్డుపైకి ఎర్ర మట్టి చేరుతోందని, ఎన్టీఆర్ మినీ క్రికెట్ స్టేడియం వద్ద రోడ్డుపై వర్షపు నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదని, పాత బస్టాండ్ యుటర్న్ వద్ద విరిగిన సిమెంట్ పలకలు స్థానంలో కొత్తవి అమర్చాలని, సామాజిక మరుగు దొడ్లను వినియోగంలోకి తేవాలని కోరారు. టిడిపి వార్డు అధ్యక్షులు గంటా నూకరాజు, నాయకులు జి పోలిరాజు, కొక్కిరి అప్పన్న, ఎస్.చిన్న పాల్గొన్నారు.










