ప్రజాశక్తి -ఏలేశ్వరం తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి సహకరించాలని ప్రత్తిపాడు ఎంఎల్‌ఎ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌కు ఆదివారం వినతిపత్రం ఇచ్చారు. ఈ వినతిపత్రంలో కరోనా సమయంలో కూడా సేవలందించామని, ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో ముఖ్య భూమిక పోషిస్తున్నామని తెలిపారు. తమకు జీతాలు, పిఎఫ్ వెంటనే చెల్లించాలని, ఉద్యోగ భద్రత, ట్రాన్స్‌ఫర్ సౌకర్యం కల్పించాలని కోరారు.










