Jul 07,2023 23:52

సమస్యలను తెలుసుకుంటున్న ఎమ్మెల్యే ఫాల్గుణ

ప్రజాశక్తి - పెదబయలు:సీతగుంట పంచాయతీ రోగులపేట గ్రామంలో గడప గడపలో భాగంగా అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ శుక్రవారం పర్యటించారు. జోరు వర్షంలో తడుస్తూనే గడప గడపకు వెళ్లారు. గ్రామంలో సిసి రోడ్డు, డ్రైనేజి, మంచినీరు వంటి సమస్యలు పరిష్కారం చేయాలని మహిళలు కోరారు. పంచాయతీకు 40 లక్షలు మంజూరు చేశామని సంబంధిత ఇంజిరింగ్‌ అధికారులు ఎస్టిమేట్‌ వేసి ఎక్కడ ఏ ఏ సమస్యలున్నాయో ఈనెల 11 న లిఖితంగా తెలియజేయాలన్నారు గ్రామవాలంటీర్ల ద్వారా సమస్యలు తెలియజేయాలన్నారు.సిపిఎం మండల మహిళా అధ్యక్షురాలు టి.కౌసల్య మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి పంచాయతీ నిధులు రాష్ట్ర ప్రభుత్వం దారి మల్లించడంతో ప్రజలు పనులు కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కూడా బొంజుబాబు, సర్పంచి మాధవరావు, వైస్‌ సర్పంచ్‌ బోండా గంగాదరం, వైసిపీ నాయకులు గంపరాయి సూరయ్య, మాజీ జడ్పీటీసీ జర్సింగి గంగా భవాని, సర్పంచుల ఫోరమ్‌ మాజీ అధ్యక్షులు పాంగి సింహాచలం, తదితరులు పాల్గొన్నారు.