Jun 27,2023 00:51

సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి -కోటవురట్ల: గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని సోమవారం వెంకటాపురం గ్రామంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు స్థానికులు మొర పెట్టుకున్నారు. బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, గ్రామస్తులు అధిక చార్జీలు చెల్లించి ఆటోలో ప్రయాణించాల్సి వస్తుందని తెలిపారు. అనంతరం గ్రామంలో స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా గ్రామంలో కాలనీ ఇల్లు మంజూరుకు వేడుకున్నారు. గతంలో గ్రామ శివారున ఇచ్చిన కాలనీ స్థలం నివాసయోగ్యం కాకపోవడంతో లబ్ధిదారులు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామంలో తాగునీటి, డ్రెయినేజీ, పలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. అనంతరం జిల్లా పరిషత్‌ పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయంలో అధికారులతో సమావేశమై సచివాలయ సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించాలని మండల ప్రత్యేక అధికారి డిఎల్‌డిఓ అరుణశ్రీని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యురాలు ఉమాదేవి, మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు, బిసి సెల్‌ జిల్లా అధ్యక్షులు పైలా రమేష్‌, వైస్‌ ఎంపీపీ దత్తుడు రాజు, స్థానిక సర్పంచ్‌ ఇందిరా శ్రీదేవి, తహసిల్దార్‌ జానకమ్మ, ఏఓ చంద్రశేఖర్‌, పలు శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.