Aug 23,2023 23:12

మాట్లాడుతున్న నటరాజ్‌

ప్రజాశక్తి - అజిత్‌సింగ్‌నగర్‌ : రాష్ట్రంలో నెలకొన్న దళిత సామాజిక, ఆర్థిక,సమస్యలపై ఒక ప్రత్యేకమైన యాత్రను నిర్వహించాలని కెవిపిఎస్‌, ఎఐఎడబ్ల్యుయు సంయుక్తగా, ''దళిత రక్షణ యాత్ర'' చేయాలని నిర్ణయించారు. దీనిని అన్ని జిల్లాలల్లో, జరిపేందుకు సన్నాహక ఏర్పాట్లు చేసేం దుకు ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ, సెంట్రల్‌ సిటీ ఎంహెచ్‌ భవన్‌లో, ఉభయ రాష్ట్ర కమిటీలు రూపొందించిన డిమాండ్లను చర్చించేందుకు చర్చాగోష్టి నిర్వహించారు. ఈ చర్చాగోష్టి దళిత, గిరిజన, కార్మిక, ఉద్యోగ, మహిళ, యువజన, క్రైస్తవ సంస్థలు పాల్గొన్నాయి. ఈ చర్చాగోష్టి కెవిపిఎస్‌ జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు చింతల శ్రీనివాస్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార కేసుల్లో 41 సిఆర్పిసి నోటిసులు తీసుకుని దోషులను బెయిల్‌పై బయటకు పంపటాన్ని నిలిపివేయాలని, జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫార్సులను అమలుచేయాలని, దళితులపై దాడులు జరిగిన సందర్భంలో ప్రభు త్వానికి తెలియ జేసేందుకు ట్రోల్స్‌ నెంబర్‌ ప్రకటించాలని, కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులను అలుచేయాలి. దళితులకు 1235 జీవో ప్రకారం 2 ఎకరాల శ్మశాన భూమిని కేటాయించాలి అని డిమాండ్‌ చేశారు. ప్రైవేటు రంగంలో కూడ రిజర్వేషన్లు అమలు చేయాలని, సబ్‌ప్లాన్‌ చట్టానికి కాలపర్మితి తోలగించి,నిధులు దారిమళ్ళించకుండా కట్టుదిటం చేయ్యాలి; దళిత, గిరిజనులకు 200 యూనిట్లు ఉచితం కరంట్‌ ను,ప్రాంతాలతో సంబందం లేకుండా అమలుచేయాలి ఇంకా మొదలైన డిమాండ్లతో కూడిన తీర్మానాన్ని సంఘాల నాయుకుల ఆమోదం కొరకు ప్రవేశ పెట్టారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.కెవిపిఎస్‌ జిల్లా కమిటీ సభ్యురాలు జి అరుణ పోరాట సాధన కమిటికి కన్వీనర్‌ గా, మరో15 మందితో కమిటీ వేయటం జరిగింది.