ప్రజాశక్తి - యంత్రాంగం
సమస్యలను పరిష్కరించాలంటూ భవన నిర్మాణ కార్మిలు కదం తొక్కారు. జిల్లాలో పలుచోట్ల ధర్నాలు నిర్వహించారు. కాకినాడరూరల్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు కార్మికులకే ఖర్చు చేయాలని, మెమో 1214 రద్దు చేయాలని కోరుతూ కాకినాడ రూరల్ మండల రెవెన్యూ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మండల రెవెన్యూ అధికారి వి.మురార్జీకి వినతి పత్రం అందించారు. సందర్భంగా సిఐటియు నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, టి.రాజా మాట్లాడారు. బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు జరగవని సాక్షాత్తు రాష్ట్ర కార్మికశాఖ కమిషనర్ మెమోను జారీ చేయడం తగదన్నారు. తక్షణమే మెమో 1214ను రద్దు చేయాలన్నారు. 60 ఏళ్లు నిండిన భవన నిర్మాణ కార్మికులను కూడా వెల్ఫేర్బోర్డులో సభ్యులుగా కొనసాగిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. పెండింగ్ క్లెయిమ్‌లను వెంటనే పరిష్కరించాలన్నారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి చందర్రావు, హరినాథ్ నాయకులు రాయుడు విజరు, వి.సత్తిబాబు, పుల్ల వెంకట సత్యనారాయణ, అర్. సుబ్రహ్మణ్యం, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. గండేపల్లిలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం తహశీల్దార్ కెవివి.సత్యనారాయణకు వినతి పత్రం అందించారు. ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు రొంగల ఈశ్వరరావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల భవన నిర్మాణ సంఘ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏలేశ్వరంలో భవన నిర్మాణ కార్మికులు మంగళవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు పాకలపాటి సోమరాజు, పిల్లా రాంబాబు మాట్లాడారు. కార్మిక సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన మెమోను రద్దు చేయాలన్నారు. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను వెంటనే పరిష్కరించాలన్నారు. కరోనాలో చనిపోయిన కార్మికులకు రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి సుశీల, జల్లు అప్పలరాజు, బొడ్డు భద్రమ్మ, జె.సతీష్, ఎం.ప్రసాద్, బి.దుర్గబాబు, జి.చక్రం, ఎం.రామారావు, అడపా అప్పారావు పాల్గొన్నారు. పెద్దాపురంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం తహశీల్దార్ జితేంద్రకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు చింతల సత్యనారాయణ మాట్లాడారు. సంక్షేమ బోర్డును యథావిధిగా కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు తైనాల శ్రీను,రాజమంద్రపు రామారావు,గొల్లపల్లి శ్రీను,గూనూరు రమణ,కరణం అప్పారావు,వడ్డి సత్యనారాయణ, గడపా వీరబాబు, నీలపాల కృష్ణ, ముమ్మన శ్రీను,పూసల సుబ్బారావు, నీలపాల సూరిబాబు, క్రాంతి కుమార్, సిరపరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద భవనిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహించి అనంతరం తహశీల్దార్ త్రినాధరావుకు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కుంచె చిన్న, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు డి సత్యనారాయణ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మెమో 1214ను వెంటనే రద్దు చేయాలన్నారు. సంక్షేమ బోర్డు పునరుద్ధరణ చేసి పెండింగ్ క్లెయిమ్‌లను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరణం విశ్వనాథం, జి.వీరబాబు, కె.రమణ, ఎలక్ట్రికల్ యూనియన్ నాయకులు వి.రామన్నరాజు, వై.వీరభద్రం, సత్తిబాబు, డి.గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కోటనందూరులో సిఐటియు మండల కార్యదర్శి పద్మ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర ్వహించారు. సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, నిధులను జమచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నూకరాజు , బొజ్జ, ఎం. మాణిక్యం ,పి .నాగేశ్వరరావు పి .శ్రీను, జి.తమ్మయ్య, అప్పారావు, కన్నబాబు వేగి రమణ, భూషణం, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.










