Jun 28,2023 23:24

కరపత్రాలను అందజేస్తున్న అంగన్‌వాడీలు

ప్రజాశక్తి -అనంతగిరి:అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం, పెన్షన్‌ వంటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మండల కేంద్ర వద్ద అంగన్వాడి కార్యకర్తలు నిరసన చేపట్టారు. అంగన్వాడీ యూనియన్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్‌. కళావతి, పి.మంజుల ఆధ్వర్యంలో మండలంలోని పలు సెక్టర్లలో బుధవారం జరిగిన సమావేశం అనంతరం నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు ఆందోళన చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జూలై 10, 11 తేదీల్లో కలెక్టరేట్‌ వద్ద జరిగే ధర్యా కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు చిలకమ్మ, కుమారి పాల్గొన్నారు.