ప్రజాశక్తి-కాకినాడ తమ సమరస్యలు పరిష్కరించాలని 104 సర్వీసెస్ ఉద్యోగులు ఇన్‌ఛార్జి డిఎంహెచ్‌ఒ డాక్టర్ కె.సత్యనారాయణకు గురువారం వినతి పత్రం అందించారు. 104లో పని చేస్తున్న ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు రాలేదని, ముఖ్యమంత్రి హామీ మేరకు 104లో పనిచేస్తున్న డ్రైవర్, డిఇఒలను ఔట్‌సోర్సింగ్‌లో కలపాలని, అరబిందో యాజమాన్యం పిఎఫ్ ఉద్యోగుల నుంచి అక్రమంగా వసూలు చేస్తోందని తెలిపారు. దీనిపై నోడల్ అధికారి పి.సరితా దేవి సానుకూలంగా స్పందించారు. వారి సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ తమకు న్యాయం చేసే వరకు పలు విధాలుగా నిరసన కార్యక్రమాలు చేస్తామని ఉద్యోగులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపి 104 ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.త్రిమూర్తులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేట్ల రాంబాబు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటరావు, కోశాధికారి సిహెచ్.శ్రీను, ఉపాధ్యక్షులు వి.ఇందుమతి, మహిళ ఉద్యోగులు, నాయకులు పాల్గొన్నారు.










