Oct 21,2023 22:31

ప్రజాశక్తి- గోకవరం గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్య లను పరిష్కరించండి మహాప్రభో అంటూ ఆయా గ్రామాల ప్రజాప్రతి నిధులు మండల పరిషత్‌ సమావేశంలో వేడుకున్నారు. మండల పరిషత్‌ అధ్యక్షురాలు సుంకర శ్రీవల్లి అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు పాల్గొని గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఈ సమావేశం వేదిక అని ప్రజాప్రతినిధులకు ఆయన గుర్తు చేశారు. దీనిపై మండలం లోని 14 గ్రామపంచాయతీల పరిధిలో నెలకున్న సమస్యలను ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. వివిధ గ్రామాల్లో విద్యుత్‌ స్తంభౄలు లేవని, మంచినీటి ఎద్దడి అధికంగా ఉందని, జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి రుణం మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని, జల జీవన్‌ మిషన్‌ పథకంలో పైపులైన్లు, కుళాయిల ఏర్పాటు, మంచినీటి సరఫరాకు కొత్తగా ఒవర్‌ హెడ్‌ ట్యాంకులను నిర్మించాలని, రోడ్లను నిర్మించాలని పలువురు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఎంఎల్‌ఎ చంటిబాబు ఎంపిటిసి సభ్యులు లేవనెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించాలే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఖరీఫ్‌ సాగుకు సంబంధించి ధాన్యంను రవాణా చేసేందుకు అవసరమైన గోనె సంచులు, జిపిఎస్‌ మిషన్‌ తదితర అంశాలను ఎంఎల్‌ఎ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పరి ష్కరిస్తానని ఎంఎల్‌ఎ హామీ ఇచ్చారు. ఈ సమా వేశంలో వైసిపి నాయకులు జనపరెడ్డి సుబ్బా రావు, దాసరి రమేష్‌, సుంకర వీరబాబు, పాటి రాంబాబు, మడికి మైనర్‌ బాబు, చింతల అనిల్‌ కుమార్‌, నారాశెట్టి నరసయ్య, దొడ్డ విజరు, ఎంపిటిసి సభ్యులు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.