Dec 27,2022 23:59

సచివాలయం వద్ద ధర్నా చేస్తున్న సిపిఎం నాయకులు, గ్రామస్తులు

ప్రజాశక్తి -విఅర్‌.పురం
మండలంలోని కుందులూరు, ములకనపల్లి గ్రామ పంచాయతీలలో అపరిస్కృతంగా సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతు సిపిఎం ఆధ్వర్యాన మంగళవారం ములకలపల్లి గ్రామ సచివాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చిన్నబాబు మాట్లాడుతూ కుందులూరు గ్రామంలో వాటర్‌ సమస్యపై పలు సార్లు ఎంపీడీవో, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తీవ్ర నిర్లక్ష్యం వహించారని తెలిపారు. పెద్దమట్ట పల్లి గ్రామం నుండి తెల్లవారిగూడెం, కుందులూరు మీదుగా నర్సంపేట గ్రామం వరకు రహదారిని నిర్మించేందుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారని, దీంతో మంచిగా ఉన్న రోడ్డును తవ్వి వదిలేసారని, దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. పెద్ద మట్టపల్లి నుండి నర్సంపేట వరకు మంజూరైన రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. కొత్త రేషన్‌ కార్డులు వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. అనంతరం సచివాలయ కార్యదర్శికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సవలం మారయ్య, సిపిఎం మండల నాయకులు పంకు సత్తిబాబు, వడ్లాది రమేష్‌, బుచ్చయ్య, తెల్లం శాంతిరాజ్‌, సోడి వెంకటేశ్వర్లు, కుంజ భాస్కర్‌, సవలం కన్నయ్య, నూనె నాగేశ్వరరావు, నూనె ప్రభాకర్‌ పాల్గొన్నారు.