ప్రజాశక్తి-డుంబ్రిగుడ: ఐసిడిఎస్‌కు బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు కే.కొండమ్మ, స్థానిక సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం అరకు సంతబయలులో పోస్టర్స్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కొండమ్మ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడి వర్కర్లకు గ్రాడ్యుటి అమలు చేసి, సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. మినీ అంగన్వాడి సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేసి, హెల్పర్లకు ప్రమోషన్లు కల్పించే వయస్సును 50 ఏళ్ళు పెంచాలని, సర్వీసులో ఉండి మృతి చెందితే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. 2017 నుండి పెండింగ్లో ఉన్న టిఏ బిల్లులు వెంటనే చెల్లించి, వేతనాలతో కూడిన మెడికల్ లీవ్‌లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనను ఉదృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జి.పవిత్ర, టి సత్యవతి, కే.మల్లమ్మ, జీ.రుక్మిణి, రామలక్ష్మి, టి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.










