ప్రజాశక్తి -సీలేరు
పాడేరు నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత స్థానిక ఎంపీ జి.మాధవి, ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి ఉందని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. జీకే వీధి మండలం సీలేరు పంచాయతీ పరిధి చింతపల్లి క్యాంపులో ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని మంగళవారం ఆమె చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజనులతో సమావేశమయ్యారు. తమ గ్రామానికి సిసి రోడ్లు ఏర్పాటు చేయాలని, మంచినీరు సౌకర్యం లేక అనేక ఇబ్బందులు గురవుతున్నామని స్థానికులు తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లకు రూ.1.50లక్షలు ఖర్చు చేసి పునాదులు నిర్మించుకుంటే ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని వెల్లడించారు. దీనికి ఈశ్వరి తమ ప్రభుత్వం అధికారంలో లేదని, ఈ సమస్యలను తీర్చవలసిన బాధ్యత ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీకే వీధి మాజీ జెడ్పిటిసి నళిని, టిడిపి నాయకులు నక్క హరిహర తిరుమలరావు, విష్ణు, చిటికెల రాము, చంద్రకళ పాల్గొన్నారు.










