
బెలగాం: జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజలు తెలియజేసిన సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టరు నిశాంత్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జాయింటు కలెక్టరు ఆర్.గోవిందరావు, ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్, డిఆర్‌ఒ జె.వెంకటరావుతో కలిసి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజలు తెలియజేసిన సమస్యల గురించి సంబంధిత జిల్లా, మండల అధికారులతో నేరుగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీచేశారు. అర్జీలపై సకాలంలో స్పందించి, చర్యలు తీసుకోవాలన్నారు. పాలకొండ మండలం కోమటిపేటకు చెందిన చల్లా నాగభూషణరావుకు జాయింటు కలెక్టరు ఆర్. గోవిందరావు వినికిడియంత్రాన్ని అందజేసారు. కార్యక్రమంలో ప్రజలు పలు సామాజిక, వ్యక్తిగత అంశాలపై 156 అర్జీలు అందజేశారు. కార్యక్రమంలో వివిధశాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
స్పందనకు 38 వినతులు
సీతంపేట :స్థానిక ఐటిడిఎ స్పందనకు 38 వినతులు వచ్చాయి. పిఒ కల్పనా కుమారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంనిర్వహించారు. కన్నయ్యగూడకు చెందిన సన్నాయి రోడ్డు మంజూరు చేయాలని, రెల్లిగూడకు చెందిన బంగారమ్మ సామాజిక భవనం మంజూరు చేయాలని కోరారు. పక్మిణిగూడ చెందిన రామారావు పాలకొండ పెట్రోల్ బంకులు ఉద్యోగం ఇప్పించాలని, పాతపట్నం మండలం దాసుపురం చెందిన జగదీష్ ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని, కిరపకు చెందిన జయశ్రీ కుట్టు మిషన్ ఇప్పించాలని, సంకిలి చెందిన బాలాజీ ఆర్థిక సహాయం అందించాలని వినతిని అందజేశారు. వజ్రైగూడెంకు చెందిన బాలరాజు కిరాణా షాపు మంజూరు చేయాలని కోరారు. స్పందన కార్యక్రమంలో ఎపిఒ రోసిరెడ్డి, జిసిసి డిఎం సంధ్యారాణి, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ విజయపార్వతి, డిప్యూటీ డిఇఒ లిల్లీరాణి, సిడిపిఒ రంగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.