Aug 28,2023 20:05

వినతులు స్వీకరిస్తున్న గోవింద్‌ సింగ్‌

ప్రజాశక్తి - ఆదోని
స్పందన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ పరిపాలన అధికారి గోవింద్‌ సింగ్‌ అధికారులకు సూచించారు. సోమవారం ఆదోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన స్పందనలో డివిజన్‌లోని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామస్థాయిలో పూర్తయ్యే సమస్యలు డివిజన్‌ స్థాయి వరకు రాకుండా చూసుకోవాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్‌ ఎస్‌ఎల్‌ఎలోకి వెళ్లకుండా చూడాలన్నారు. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ వేణు సూర్య, బీసీ వెల్ఫేర్‌ లక్ష్మీనారాయణ, వ్యవసాయ శాఖ ఎడిఎ గిరీష్‌ కుమార్‌ రెడ్డి, డిఎల్‌డిఒ నాగేశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఇంజినీర్‌ రవికుమార్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ చేతన్‌ ప్రియ, ఎస్సీ వెల్ఫేర్‌ సుధాకర్‌ పాల్గొన్నారు.