Oct 16,2023 22:04

అర్జీదారులతో మాట్లాడుతున్న ఎఎస్‌పి దిలీప్‌ కిరణ్‌

ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ :  ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చక్కటి మార్గం స్పందన కార్యక్రమమని ఎఎస్‌పి దిలీప్‌ కిరణ్‌ అన్నారు. ఎస్‌పి కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన అర్జీలను స్వీకరించారు. అర్జీదారు లతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని, వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని సూచించారు. తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో దిశా డిఎస్‌పి ఎస్‌.ఆర్‌.హర్షిత, ఎస్బి సిఐ సిహెచ్‌.లక్ష్మణ రావు, డిసిఆర్‌బి సిఐ ఎన్‌.వి.ప్రభాకర రావు, ఎస్‌ఐ పాపారావు, సిబ్బంది పాల్గొన్నారు.