సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం- 'జగనన్నకు చెబుదాం'లో కలెక్టర్ గిరీష

పెనగలూరు : స్థానిక సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలని కలెక్టర్ గిరీష తెలిపారు. బుధవారం ఎంపిడిఒ కార్యాలయ ఆవరణంలో కలెక్టర్ అధ్యక్షతన మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సచివా లయాల ద్వారా ఇప్పటికే అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం లబ్ది అందిస్తోంది. గ్రామస్థాయిలో చిన్న చిన్న అంశాలు ఏవైనా జిల్లా అధికారుల ద ష్టికి రానివి జిల్లా కేంద్రానికి రాలేని వారి కొరకు మండల స్థాయిలోనే జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి బుధ, శుక్రవారం నాడు ఒక్కొక్క మండల కేంద్రంలో జగనన్నకు చెబుదాం మండల స్థాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు, మండల అధికారులు అందరూ ఈ కార్య క్రమంలో పాల్గొంటున్నందున ప్రజలకు అవసరమైన అన్ని సర్వీసులు సులభంగా అందించే అవకాశం ఏర్పడుతోంది. అంతేకాక మండల స్థాయిలో వచ్చిన స్థానిక సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపే అవకాశం ఉంది. సచివాలయాల పరిధిలో కూడా ఏవైనా పరిష్కారం కాని సమస్యలు ఉంటే మండల స్థాయి స్పందన కార్యక్రమంలో తెలియజేయవచ్చునున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి పథకం అర్హులకు అందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం. అర్హులైన ఏ ఒక్కరూ లబ్ధి అందలేదని ఆగిపోరాదు. ప్రభుత్వ శాఖల్లో టెక్నికల్ గా ఏదైనా కారణంతో ఆగిపోయిన అంశాలను పరిశీలించి వాటికి తగిన పరిష్కారం సూచించడానికి మండల స్థాయి జగనన్న కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు అందరూ ఇక్కడికి వస్తారు. మీ సమస్యలన్నిటికి పరిష్కారం చూపుతారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే 1902 టోల్ ఫ్రీ నెంబర్ కు కూడా ఫోన్ చేసి తెలపవచ్చు. ప్రజలందరూ సహకరించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ గిరీష, రాజంపేట ఆర్‌డిఒ రామకృష్ణారెడ్డి అర్జీలు స్వీకరించి పరిష్కారం కొరకు వాటిని సంబంధిత శాఖల జిల్లా అధికారులకు ఎండార్స్ చేసి సత్వరం పరిష్కరించాలని కలెక్టరు ఆదేశించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు విజరురెడ్డి, తహశీల్దార్ శ్రీధర్‌రావు, ఎంపిడిఒ వరప్రసాద్, సర్పంచ్ వెంకట రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.