Sep 20,2023 20:27

సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ విజరురామరాజు

చెన్నూరు : స్థానిక సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలని కలెక్టర్‌ వి.విజరురామరాజు అధికారులకు సూచించారు. బుధ వారం ఎంపిడిఒ కార్యాలయ ఆవరణంలో మండల స్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ వి.విజరు రామరాజుతో పాటు జెసి గణేష్‌ కుమార్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, కడప ఆర్‌డిఒ ధర్మచంద్రారెడ్డి హాజరై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి రాలేని వారి సమస్యలను స్థానికంగానే పరిష్కరించే దిశగా మండల స్థాయిలో ప్రతి బుధ, శుక్ర వారాల్లో ఒక్కొక్క రోజు ఒక్కో మండ లంలో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించేలా ప్రభు త్వం అత్యంత ప్రధాన్యతతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిం దన్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు గ్రామ స్థాయి సమస్యలు మండల స్థాయిలోనే త్వరితగతిన పరిష్కారం అయ్యేలా మండల స్థాయి అధికారులు ప్రత్యేక దష్టి సారించాలన్నారు. ఇప్పటికే చాలా వరకు ఆయా గ్రామాల్లోని సమస్యలకు సచివాలయాల పరిధిలోనే పరిష్కారం అందివ్వడం జరుగుతోందన్నారు. అర్హతలు ఉండి ప్రభుత్వ పథకాలు అందుకోలేని వారు వెంటనే వారి పరిధిలోని సచివాలయాల్లో దరఖాస్తులు సమర్పించి ప్రభుత్వ పథకాల లబ్ది పొందాలన్నారు. ప్రజల సమస్యలకు మెరుగైన, వేగవంతమైన పరిష్కారం అందించే దిశగా ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం మొత్తం చెన్నూరు మండలం చేరుకోవడం జరిగిందని ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులను ఆయా శాఖల అధి కారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ అధికారులకు సూచించారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపిపి చీర్ల సురేష్‌ యాదవ్‌, కుప్పం మండల అధ్యక్షుడు ఆర్‌.సుబ్బారెడ్డి, టౌన్‌ కన్వీనర్‌ ముది రెడ్డి సుబ్బారెడ్డి, కనపర్తి ఎంపిటిసి రఘురామిరెడ్డి, సొసైటీ అధ్యక్షులు అల్లి శ్రీరామమూర్తి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు సొంటం నారా యణరెడ్డి, శివాలపల్లి సర్పంచ్‌ సుదర్శన్‌రెడ్డి, చెన్నూరు మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ కళ్యాణ్‌, స్పెషలాఫీసర్‌ డాక్టర్‌ హెచ్‌.వెంకట సుబ్బయ్య తహశీల్దార్‌ పఠాన్‌ అలీఖాన్‌, ఎంపిడిఒ సురేష్‌ బాబు పట్టణ, మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.