బి.కోడూరు : మండలంలోని మున్నెల్లి గ్రామం కనీస వసతులకు నోచుకోలేదు. ముఖ్యంగా డ్రెయినేజీ, రోడ్లు, వీధిలైట్లు వంటి సౌకర్యాలు లేవు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షమొచ్చినప్పుడు రోడ్లన్నీ అధ్వానంగా తయారవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు రోడ్లపై ఉండడంతో ఎక్కడ గుంత ఉందో తెలియక ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. డ్రెయినేజీ సక్రమంగా లేకపో డంతో కొన్ని వీధుల్లో ఇళ్ల ముందు మురుగు నీరు నిల్వ ఉంటూ దోమలకు నిలయంగా మారింది. రోజూ సాయంత్రమైతే దోమలు స్వైరవిహారం చేస్తూ వ్యాధులకు గురిచే స్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఇళ్లల్లో నుంచి వ్యర్థపు నీరు రోడ్డుపై నిల్వ ఉండకుండా డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వీధిలైట్ల నిర్వహణ సక్రమంగా లేదు. వీధిలైట్లు వెలగకపోవడంతో రాత్రుళ్లు వీధులన్నీ అంధకారంగా మారాయి. విష పురుగుల సంచారం అధికంగా ఉండడంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటు రావడానికి బయపడుతున్నారు. సమస్యలపై స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. కొందరు గ్రామ కంటాలను ఆక్రమించడంతో ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతమ వుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై తహశీల్దార్‌కు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, చెరువులు కూడా అధ్వానంగా ఉందని, ఆయకట్టు పొలాలకు సాగు నీరు అందే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.










