Sep 17,2023 21:27

సమస్యల వలయంలో కెజిబివి విద్యార్థులు

చిట్వేలి : మండల పరిధిలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు సమస్యల వలయంలో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో సరైన మౌళిక వసతులు లేక కొట్టుమి ట్టాడు తున్నారు. పాడైన పోయిన మరుగుదొడ్లకు నాలుగేళ్ల క్రితం మరమ్మతులు చేపట్టారు.ప్రస్తుతం అవి పనిచేయక పోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. ఆర్‌ఎంఎస్‌లో ఇటీవల నిర్మించిన నూతన భవ నాల్లో కూడా మరుగు దొడ్లు నిర్మించలేదు. గతంలో నాలుగు సంవత్సరాల క్రితం వ్యాయామ ఉపాధ్యాయురాలు బదిలీపై వెళ్లగా, నాలుగేళ్ల తర్వాత నూత నంగా వ్యాయామ ఉపాధ్యాయురాలు పాఠశాలకు వచ్చినా ఆట స్థలం పూర్తిగా పిచ్చి మొక్కలతో నిండిపో యింది. పాఠశాల ప్రారంభ దశలోనే ఉపాధ్యాయురాలు అందుబాటులో ఉన్న ఆట స్థలంలో మొక్కలు తొలగించక పోవడంతో మైదానం అడవిని తలపిస్తుంది. పాఠశాల మొత్తంలో 225 మంది విద్యార్థులు ఉండగా అందులో ఇంటర్‌ విద్యార్థులు 30 మంది వరకు ఉన్నారు. వీరిలో ప్రత్యేకంగా కేటాయించిన నూతన భవనంలో మరుగుదొడ్ల సమస్య బాధిస్తుందని పిల్లల తల్లిదండ్రులు అంటున్నారు. ఇప్పటికైనా స్థానిక, జిల్లా అధికారులు వెంటనే స్పందించి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థుల కష్టాలను తీర్చేలా కషి చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలి
పాఠశాలలో అన్ని వసతులు బాగున్నా, మరుగుదొడ్ల సమస్యల పిల్లలను వేది స్తోంది. చీటికి మాటికి మరుగుదొడ్లు నిండి పిల్లలకు ఇబ్బందికరంగా మారింది. అధికారులు స్పందించి మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలి. క్రీడా మైదానంలో పిచ్చి మొక్కలు తొలగించాలి.
-బలరాం,ఉప్పరపల్లి ,చిట్వేలి
క్రీడా మైదానంలో పిచ్చి మొక్కలు తొలగించాలి
ప్రభుత్వం పాఠశాలల్లో పిల్లలకు అన్ని రకాల వస్తువులు కల్పించాలి. క్రీడా మైదానం పిచ్చిమొక్కలతో నిండిపోయి ఆడుకునేందుకు వీలులేకుండా ఉంది. మరుగుదొడ్ల సమస్య కూడా పిల్లలను వేదిస్తోంది. బాలికలు ఉన్న పాఠశాల కనుక అన్ని వసతులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. -నాగమునెమ్మ, గాంధీనగర్‌, చిట్వేలి