Nov 08,2023 22:52

ప్రజాశక్తి - గోకవరం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణ పరిష్కారం చూపేందుకే మండల స్థాయి జెకెసి సమావేశాలను నిర్వహిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌ భరత్‌ అన్నారు. బుధవారం స్థానిక గోపీకృష్ణ ఫంక్షన్‌ హాల్లో మండల స్థాయి జెకెసి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జెసితో మాట్లాడుతూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రామ స్థాయిలో సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ జెకెసి, గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాల ద్వారా ప్రజల వద్దకే అధికారులను పంపించి సేవలు అందించడం జరుగుతుందన్నారు.్యక్రమంలో డిఆర్‌ఒ జి.నరసింహులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.