Sep 09,2023 00:08

వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-కోటవురట్ల:గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా జగన్‌ అన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రవి పటాన్‌ శెట్టి అన్నారు. శుక్రవారం నాతవరం మండలంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 178 మంది వారి సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. ప్రధానంగా మండలంలో భూ సమస్యలు, భూమి పట్టాలు, ఇళ్ల పట్టాలు, తాగు, సాగునీటి సమస్యలు పరిష్కరించాలని, తాండవ రిజర్వాయర్‌ నుంచి నీరు వృథాగా పోతుందని పలువురు కోరారు. లేట రైట్‌ అనుమతులు రద్దు చేయాలని సిపిఎం నాయకులు అడిగర్ల రాజు . వినతి పత్రాలు అందజేశారు. కాపులకు బిసి సర్టిఫికెట్లు అందజేయాలని కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. నర్సీపట్నంలో సాగునీటి ఇంజనీరింగ్‌ కార్యాలయాన్ని కొనసాగించాలని నాతవరం ఎంపీపీ వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రతి సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం జిల్లా, మండల స్థాయి అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ జాహ్నవి, ఏ ఎస్‌ పి అది రాజ్‌ సింగ్‌ రాణా, అసిస్టెంట్‌ కలెక్టర్‌ స్మరణ రాజ్‌, ఆర్డీవో వెంకట జయరాం, డిపిఓ శిరీష రాణి, తహసిల్దార్‌ శ్రీనివాస్‌ నాయుడు, పలువురు జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.