ప్రజాశక్తి - పాలకొండ : సమస్యల పరిష్కారమే జగనన్న సురక్ష కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. నగర పంచాయతీ పరిధిలోని గల 15,16 వార్డులకు సంబంధించి గారమ్మకాలనీ సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రౌతు హనుమంతరావు, కౌన్సిలర్స్ వెలమల మన్మధరావు, కడగల వెంకటరమణ, తుమ్మగుంట శంకరరావు, కోడెం విజయకుమార్, కిల్లారి మోహన్ రావు, నీలాపు శ్రీనివాసరావు, వీరఘట్టం ఎంపిపి డి.వెంకటరమణ నాయుడు, పాలకొండ వైస్ ఎంపిపి కణపాక సూర్య ప్రకాష్, దుంపల చిన్ని, చంద్రమౌళి, ముద్దాడ చక్రవర్తి, మరియదాస్, అధికారులు పాల్గొన్నారు. పాలకొండ పంచాయతీ పరిధిలోని ఎన్‌ఎస్‌ఎన్, ఎస్‌ఎల్‌ఆర్, అయ్యప్ప రైస్ మిల్లులలో తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఒక కార్డ్ కు నెలకు 10 కేజీల చెప్పునా ఫైన్ రైస్ ఒక కేజీ 38 రూపాయలకు అందించేందుకు గాను ఎమ్మెల్సీ ప్రారంభించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పాలకొండ, రూరల్ : మండలం అంపిలిలో జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమం చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో వీరఘట్టం ఎంపిపి డి.వెంకటరమణ నాయుడు, పాలకొండ వైస్ ఎంపిపిలు కణపాక సూర్య ప్రకాష్, వాకముడి అనిల్, సర్పంచులు లోలుగు విశ్వేశ్వరరావు, గవర రాజశేఖర్, గవర దుర్గారావు, సంగంనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పదో తరగతిలో జిల్లా ప్రథమ ర్యాంక్ సాధించిన విద్యార్థిని పాడి హేమలత (587)ను సన్మానించారు.
వీరఘట్టం : మండలంలోని చిదిమి, నడుకూరు గ్రామాల్లో జగనన్న సురక్ష కార్యక్రమం ఎంపిపి డి.వెంకటరమణ నిర్వహించారు. అనంతరం పలువురికి వివిధ రకాల ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు డి.ఉమామహేశ్వరరావు, కర్రి రమాదేవి, మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ కర్రీ లీలాప్రసాదరావు, తహశీల్దారు సిహెచ్ సత్యనారాయణ, ఎంపిడిఒ జి.జయంత్ ప్రసాద్, ఇఒపిఆర్‌డి వి.రామచంద్రరావు, ఆర్‌ఐ ఎస్.మారుతీరావు, సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : మండలంలోని ఎల్విన్‌పేటలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి నాలుగున్నర ఏళ్లలో పేదల సంక్షేమం, అభివృద్ధియే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని అన్నారు. అర్హులుగా ఉండీ సంక్షేమ పథకాలు అందని వారుంటే వారిని గుర్తించి పథకాల మంజూరుకు సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్ల కృషి చేయాలని అన్నారు. కొత్తగా మంజూరైన ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎల్విన్‌పేట సర్పంచి ఆర్.చైతన్య స్రవంతి, ఇఒపిఆర్ డి.జగదీష్ కుమార్, తహశీల్దార్ రాములమ్మ, సచివాలయం సిబ్బంది ఉన్నారు.
భామిని : మండలంలోని నులకజోడు లో సర్పంచ్ కొత్తూరు ప్రసాద్ రావు, కొసలి గ్రామం లో సర్పంచ్ మజ్జి మోహన్ బాబు ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా వైస్ ఎంపిపి బోనగడ్డి ధర్మారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ నీలపు అప్పారావు, జెసిఎస్ కో-ఆర్డినేటర్ కొత్తకోట చంద్రశేఖర్, ఎంపిడిఒ చంద్రరావు, ఎంపిటిసి బూస బాలకృష్ణ, జెడ్‌పిటిసి ప్రతినిధి బొడ్డేపల్లి ప్రసాద్ రావు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
సాలూరు రూరల్ : మండలంలోని తోణాంలో సర్పంచ్ మువ్వల ఆదయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రెడ్డి పద్మావతి పాల్గొన్నారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా ప్రధానకార్యదర్శి దండి శ్రీనివాసరావు, తహశీల్దార్ బాలమురళీకృష్ణ, ఎఎంసి చైర్‌పర్సన్ దండి అనంతకుమారి, మాజీ వైస్ ఎంపిపి సువ్వాడ రామకృష్ణ, సచివాలయం సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.
సీతానగరం : మండలంలోని జోగింపేట, కాశాయిపేట గ్రామ సచివాలయాల్లో జరిగిన జగనన్న సురక్ష క్యాంప్ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఎ.జోగారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జగనన్న సురక్ష క్యాంప్ ద్వారా మంజూరు కాబడిన 11రకాల సేవల ధ్రువీకరణ పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం వేదికల వద్ద ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు ఎం.బాబ్జీ, ఎంపిపి బలగ రమణమ్మ, వైసిపి మండలపార్టీ అధ్యక్షులు, ఎంపిడిఒ ప్రసాద్, తహశీల్దార్ ఎంవి రమణ, పలువురు వైసిపి నాయకులు, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.
సీతంపేట : స్థానిక సచివాలయ పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమం ఉప తహశీల్దారు మధుసూదన్‌రావు ఆధ్వర్యాన జరిగింది. ఏమైనా సమస్యలుంటే తెలియజేయాలన్నారు. అలాగే సంక్షేమ పథకాలు అందనివారుంటే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే హడ్డుబంగిలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కళావతి, ఉపసర్పంచ్ పి.బృందావతి, కార్యదర్శి బాణాల సుదర్శన్ రావు తదితరులు పాల్గొన్నారు.
గరుగుబిల్లి : మండలంలోని గొట్టివలస సచివాలయం పరిధిలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎంపిపి ఉరిటి రామారావు, తహశీల్దార్ జి.వెంకటజనార్ధన్ లబ్ధిదారులకు ధ్రువపత్రాలు అందజేశారు. అవసరమైన ధ్రువపత్రాలు లేక ప్రభుత్వ పథకాలకు అర్హులైన ఏ ఒక్కరూ దూరం కాకూడదని, అర్హులు మిగలకుండా సంక్షేమ, అభివృద్ధి పథకాలు లబ్దిపొందలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మండల ఇఒపిఆర్‌డి గోపాలరావు, గ్రామపంచాయతీ కార్యదర్శులు తిరుపతి భాస్కరరావు, మరడాన భార్గవరావు, విఆర్‌ఒ రేగిడి రామాంజనేయులు, వైసిపి నాయకులు బోను చంద్రశేఖర రావు (చంద్ర), బోను అచ్యుతరావు, పప్పల సత్యనారాయణ, గ్రామ సచివాలయ సిబ్బంది గంట జనార్ధనరావు, రెడ్డి కుంతి, తదితరులు పాల్గొన్నారు.










