
బి.కొత్తకోట : సమస్యల పరిష్కారమే ఎజెండాగా మండలం సాధారణ సర్వసభ్య సమావేశం జరిగిందని, మండలాభివృద్ధి కోసం ఎమ్మెల్యే ద్వారకనాథ్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని ఎంపిపి లక్ష్మీనరసమ్మ పేర్కొన్నారు. బుధవారం మండల సమావేశాని ఎంపిడిఒ శంకరయ్య ప్రారంభించారు. ఎంపిపితో పాటు జడ్‌పిటిసి రామచంద్రయ్య యాదవ్, మండల ప్రత్యేక ఆహ్వానితుడు అరుణ్‌కుమార్‌రెడ్డి సభా వేదికపై ఆహ్వానించారు. జడ్‌పిటిసి రామచంద్రయ్య మాట్లాడుతూ ప్రతి సచివాలయంలోనూ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వాలంటీర్లు పనితీరు మెరుగుపరచుకోవాన్నారు. ఎంపిడిఒ శంకరయ్య మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒక్కసారి నిర్వహించే మండల సర్వసభ వేశానికి వచ్చినప్పుడు ప్రతి శాఖకు చెందిన అధికారులు మూడు రోజులు ముందే నివేదిక సమర్పించాలని తెలిపారు. మూడు సర్వసభ సమావేశానికి హాజరుకాని ఎంపిటిసిలపై రాజ్యాంగబద్ధంగా వారి పదవి నుంచి తొలగిస్తామని వెల్లడించారు. విద్యుత్ శాఖ ఎఇ గిరిధర్ మాట్లాడుతూ మండలంలో రెండు విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించేందుకు అనుమతులు వచ్చాయని అందులో భాగంగా మండలంలోని రెండు విద్యుత్ సబ్ స్టేషన్లకు నిర్మాణానికి అనుమతులు వచ్చినట్లు తెలిపారు. 1782 ఎస్‌సి, ఎస్‌టి ఉచిత విద్యుత్ కోసం రూ.3.88లక్షలు ప్రభుత్వం చెల్లిస్తోం దన్నారు. పశువైద్యురాలు కిరణ్మయి మాట్లాడుతూ పాడి పశువులకు అనారో గ్యంతో ఉన్నప్పుడు అత్యవసర సమయంలో 1962 ఫోన్ చేస్తే అంబులెన్స్ అందుబాటులో ఉంటుందని ప్రజలు ఈ అంబులెన్సును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఉపాధిహామీ అధికారి మంజుల, ఎంఇఒలు రెడ్డిశేఖర్, భువనేశ్వరాచారి, డిటి మొహమ్మద్‌అన్సారి, ఇఒపిఆర్డఇ అశ్విని, మండలం ప్రత్యేక ఆహ్వానితుడు అరుణ్‌కుమార్‌రెడ్డి, ఎఎస్‌ఐ బొజ్జ ాయక్, కానిస్టేబుల్ శేఖర, ఎంపిటిసిలు సుబ్బయ్యనాయుడు, రామస ుబ్బారెడ్డి, సర్పంచులు వేమలేటికోటి రవి, గుడిపల్లి సర్పంచ్ రఘు, బడికా యలపల్లి సర్పంచ్ ఆదెప్పగౌడ్, వైస్ ఎంపిపి ఖాదర్‌వలి, కో-ఆప్షన్ నాసర్, ఎంపిడిఒ, ఎఒ థామస్, ఎంపిడిఒ ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ ప్రతాప్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
మోకాళ్లపై సర్పంచ్ నిరసన
గాలివీడు : సర్పంచ్ వ్యవస్థకు గౌరవం లేకుండా పోయిందని మండల సర్వసభ్య సమావేశంలో పూలికుంట సర్పంచ్ పార్థసారథిరెడ్డి మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 73, 74 గుర్తుకు లేకుండా పోతున్నాయని, సమావేశాల్లో సర్పంచ్‌లకు సముచిత స్థానం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపిపి జల్లా ప్రభావతమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఎంపిడిఒ శేఖర్‌నాయక్ మాట్లాడుతూ గడప గడప కార్యక్రమం మండల కేంద్రంలో పూర్తయిందని, ప్రతి గ్రామ సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున రూ.3.20 కోట్లు మంజూరైందన్నారు. ఉపాధి హామీ కింద రూ.60 లక్షల పనులు గవర్నమెంట్ నుంచి ఆమోదం పొందాయని అని పేర్కొన్నారు. పిహెచ్‌సి వైద్యాధికారి రఫిక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి జబ్బులను గుర్తించి జగనన్న ఆరోగ్య సురక్షలోనే వ్యాధి నిర్ధారణ చేసి నలుగురు వైద్య సిబ్బంది వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిటిసిలు చంద్రారెడ్డి, చిన్నరెడ్డి, సర్పంచులు దీప్తి, కేశవరెడ్డి, కొర్లకుంట సర్పంచ్ ఎంపిటిసి అమాన్‌చ పంచాయతీ కార్యద ర్శులు, సచివాలయ సెక్రెటరీలు, హౌసింగ్ ఎఇ, పిఆర్‌ఎఇ , వ్యవసాయ అధికారి పాల్గొన్నారు.