రాజంపేటరూరల్ : ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని తక్షణమే పరిష్కరించేందుకే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తెలిపారు. శనివారం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రజలకు 462 వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలను, సిఎం సహాయనిధి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజంపేట మున్సిపాలిటీకి సిఎం ఇప్ప టికే రూ.58 కోట్లు నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు.జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులురెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్‌లు మర్రి, సుమియా, పట్టణ అధ్యక్షులు కష్ణారావు, జెసిఎన్ కన్వీనర్ వడ్డేరమణ, గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ హస్తవరం, ఉమామహేశ్వర్‌రెడ్డి కౌన్సిలర్లు న్యాయమతుల్లా, పసుపులేటి సుధాకర్, రఘురామిరెడ్డి, సత్యాల రామకష్ణ, ముజిఫర్, మురళి ఆచారి, సుబ్రహ్మణ్యం గౌడ్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు వైసిపి నాయకులు పాల్గొన్నారు. రైల్వేకోడూరు : ప్రజల సమ స్యలను తెలుసుకోవడం, ప్రభుత్వ పథకాలకు అర్హులైనవారికి లబ్ధి చేకూ ర్చాలనే లక్ష్యంతోనే సిఎం జగన్ జగనన్న సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. మండలంలోని బొజ్జవారిపల్లి గ్రామ సచివాలయ ఆవరణలో జగనన్న సురక్ష నిర్వహిం చారు. కార్యక్రమంలో వైస్ ఎంపిపి ధ్వజారెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్ రాజు, డిఎస్‌ఒ రఘురాం,జడ్‌పిటిసి రత్నమ్మ, కోడూరు ఉపసర్పంచ్ తోటశి వసాయి, ఎంపిడిఒ జాషువా, బిసి మానిటరింగ్ సభ్యులు సుబ్రహ్మణ్యం, సర్పంచ్ సుబ్బయ్య, ఉప సర్పంచ్ సిద్దు, మాజీ సర్పంచ్ మావిళ్ళ సుబ్ర హ్మణ్యం, పురుషోత్తం, సూర్యనారాయణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాశక్తి- బి.కొత్తకోట నగర పంచాయతీ నాలుగవ సచివాలయం కన్వీనర్లు కంచి కళ్యాణ్‌కుమార్‌రెడ్డి, సిఆర్ చిన్ని కష్ణ ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర పంచాయతీ కమిషనర్ నరసింహ ప్రసాద్ ఆదేశాల మేరకు ఆర్‌ఐ శ్రీనివాసులు, మండల జెఎసి కన్వీనర్ హరి, నాలుగవ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ శ్రీనివాసులు, విఆర్‌ఒ హైదర్, వాలంటీర్లు ఎంఎల్‌ఒ ఇంతియాజ్, మహిళా పోలీసు, వాలంటీర్లు మనోజ్, గహసారథులు వాణి, సచివాలయం సిబ్బంది సమీర్, హౌసింగ్ సొసైటీ ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి, శ్రీనివాసులు, మధుకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు ధృవీకరణ పత్రాలు మంజూరు చేశారు. కార్యక్రమంలో జగనన్న సురక్ష కార్యక్రమం మండల ప్రత్యేక అధికారి సతీష్ కుమార్, డిటి మొహమ్మద్ అన్సారి, వెల్ఫేర్ మౌలా, విఆర్‌ఒ అమర్‌నారాయణ, గృహ సారథులు, వాలంటీర్లు పాల్గొన్నారు. నిమ్మనపల్లి : అగ్రహారం గ్రామంలో సర్పంచ్ ఉషారాణి, బండ్లపై గ్రామంలో మండల వైసిపి ఇన్‌ఛార్జి ఆర్.ఐ రమణారెడ్డి ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆగ్రహారంలో మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్పంచు ఉషారాణి, ఎంపిటిసి కుసుమ దయాకర్ రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షులు రెడ్డిశేఖర్‌రెడ్డి, ఆర్‌బికె చైర్మన్ ప్రవీణ్ కుమార్‌రెడ్డి, రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కొమ్మేపల్లి శ్రీనివాసులురెడ్డి, మండల సచివాలయాల కన్వీనర్ రామమోహన్‌రెడ్డిలు కలిసి వైఎస్‌ఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో తహశీల్దార్ సి.ఆర్.మంజుల, ఎంపిడిఒ శేషగిరిరావు, ఇఒపిఆర్‌డి చలపతిరావు, డిటి తపస్విని, నాయకులు కైలాసపతి, దయాకర్ రెడ్డి, రెడ్డి భాస్కర, యుగంధర్ రెడ్డి, సుధా కర, కే.శ్రీనివాసులు, శశిధర్‌రెడ్డి, డవ్ నాగరాజా, మౌలాలి, పంచాయతీ కార్యదర్శులు, గహ సారధులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొ న్నారు. కలకడ : జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సద్విని చేసుకోవాలని ఎంపిపి శ్రీదేవి రవికుమార్ కోరారు. మండలంలోని బాటవారిపల్లి, దేవులపల్లి పంచాయతీలలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్య క్రమంలో ఎంపిడిఒ పరమేశ్వర్‌రెడ్డి, పార్టీ కన్వీనర్ కమలాకర్‌రెడ్డి, జడ్‌పిటిసి హారిక, మండల సచివాలయం కన్వీనర్ మోహన్‌రాజా, తహశీల్దార్ ప్రదీప్, డిప్యూటీ తహసిల్దార్ చంద్రశేఖర్ ఇఒపిఆర్‌డి లతీఫ్‌ఖాన్, జిల్లా ఉద్యాన వనశాఖ అధికారి, నోడల్ అధికారి, కొన సర్పంచ్ రాజగోపాల్‌రెడ్డి, సెక్రెటరీ షబానా భాను, శివకుమార్, పార్టీ నాయకులు రెడ్డప్ప, అంజన్ కుమార్, దేవులపల్లి సర్పంచ్ వెంకట్రామన, సచివాలయం కన్వీనర్ రెడ్డప్ప, ఎపిఎం రమేష్, ఎపిఒ చెన్న కేశవులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్ పాల్గొన్నారు. రామపురం : జగనన్న సురక్ష సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ సిఇఒ రమణారెడ్డి, ఆర్‌డిఒ రంగారెడ్డిలు అన్నారు. మండలంలోని గువ్వలచెరువు, కుమ్మరపల్లి గ్రామాలలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో రామపురం మండల ప్రత్యేక అధికారి సుస్మిత, ఎంపిడిఒ హైదర్‌వలి, టిడికిషోర్, ఇఒపిఆర్‌డి ఉషారాణి, ఆర్‌ఐ రవికుమార్, జడ్‌ప ిటిసి సభ్యుడు మాసన్న వెంకటరమణ, మండల ఉపాధ్యక్షులు శివశంకర్‌రెడ్డి, సర్పంచ్‌లు రత్నమ్మ, భారతి, ఎంపిటిసిలు మౌలా, రసూల్‌బి, కో-అఫ్షన్ సభ్యులు జిలానిబాషా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కోటి బసిరెడ్డిలు పాల్గొన్నారు. కలికిరి: జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్విని యోగం చేసుకోవాలని కలికిరి మేజర్ పంచాయతీ సర్పంచ్ రెడ్డివారి కుమార్‌రెడ్డి, జడ్పిటిసి పద్మజ లోకవర్ధన్ తెలిపారు కలికిరి మేజర్ పంచా యతీ, పతేగడ పంచాయతీలలో జగనన్న సురక్షపై అవగాహన కార్య క్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు నల్లారి తిమ్మా రెడ్డి, ఎంపిడిఒ గంగయ్య, తహశీల్దార్ భాగ్యలత, ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. నందలూరు: నాగిరెడ్డిపల్లె వన్ సచివాలయానికి సంబంధించి అరవపల్లె షాదీఖానాలో జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. అర్హులైన వారికి కుటుంబ, కుల, ఆదాయ సర్టిఫికెట్లలో ఎమ్మెల్యే, ఎంపిపి మేడా విజయభాస్కర్‌రెడ్డి చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ జంబు సూర్యనారాయణ, మాజీ సర్పంచ్ భూమన శివ శంకర్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ, తహశీల్దార్ సత్యానందం, మండల కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.వీరబల్లి : ఎంపిపి రాజేంద్రనాథ్‌రెడ్డి, సర్పంచ్ సిద్ధవటం నాగులమ్మల ఆధ్వర్యంలో డి.రాచపల్లి సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి జాకీర్ హుస్సేన్, ఎంపిడిఒ మల్లేశ్వరి, మండల జెసిఎస్ కన్వీనర్ నరేష్, లాయర్ పవన్‌కుమార్‌రెడ్డి, వైసిపి నాయకులు పాల్గొన్నారు. పెద్దమండ్యం : మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ వివిధ ప్రభుత్వ పథకాలు అందించడానికి జగనన్న సురక్ష పథకం ముఖ్య ఉద్దేశ్యం అని ఎంపిపి పూర్ణ చంద్రిక, జడ్‌పిటిసి పీరమ్మ పేర్కొన్నారు. పెద్దమండ్యం బండ్రేవు సచివాల యంలో సమా వేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పెద్దమండ్యం సర్పంచ్ బాషా, బండ్రేవు సర్పంచ్ భారతి పాల్గొ న్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ రాము, ఎంపిడిఒ శ్రీధర్‌రావు, ఇఒపిఆర్‌డి జనార్దన్, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్‌లు గాజుల రామకష్ణ, సురేష్‌బాబు, ఎపిఒ మురళి, హౌసింగ్ ఎఇ సందీప్ పాల్గొన్నారు. కురబలకోట : మండలంలోని అంగళ్లు, ముదివేడు గ్రామ సచివాలయాల్లో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వ హించారు. సర్పంచ్ పోరెడ్డి విశ్వా రెడ్డి,ముదివేడు లో రాయల్ బ్రదర్స్ ఫిరోజ్ ఖాన్, ఎం.అంజద్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్ది రెడ్డి ద్వారనాథరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగ కుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకాలు అందుమతాయని అన్నారు. కార్యక్రమంలో బైసాని చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపిపి దస్తగిరి, సర్పంచ్ సహనాజ్ బేగం, తహశీల్దార్ భీమేశ్వరరావు పాల్గొన్నారు. లక్కిరెడ్డిపల్లి : మండలంలోని అనంతపురం గ్రామ సచివాలయంలో వాలంటీర్లు , గ్రామ ప్రజలు తో కలిసి జగనన్న సురక్ష కార్యక్రమంపై సమా వేశంను నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిపి మద్దిరేవుల సుదర్శన్‌రెడ్డి, ఎంపిడిఒ వెంకట్రమన రెడ్డి, కో-అఫ్షన్ సభ్యులు సయ్యద్‌అమీర్, సర్పంచ్ వెంకటనారాయణ రెడ్డి, గడ్డంకల్యాణి ప్రభాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ దుర్గయ్య, ఎపిఎం నిరంజన్, పంచాయితీ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, విఆర్‌ఒ పుష్పరాజ్ పాల్గొన్నారు.










