ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్ : దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్థానిక డివిజన్ ఆఫీస్ ప్రాంగణంలో విద్యుత్ ఉద్యోగుల జెఎసి ఆధ్వర్యంలో శుక్రవారం భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జెఎసి నాయకులు మాట్లాడుతూ, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, ఎనర్జీఅసిస్టెంట్ గ్రేడ్-2 జెఎల్‌ఎంలను రెగ్యులర్ చేసి, కారుణ్య నియామకాలు చేపట్టాలని, ఇపిఎఫ్ నుంచి జిపిఎఫ్‌గా మార్చాలని, పెండింగ్‌లో ఉన్న డిఎలు ఇవ్వాలని, ఏకసభ్య కమిషన్ సిఫార్సును రద్దుచేసి ఒకే మాస్టర్ స్కేల్ ఇవ్వాలని, ఉద్యోగులను, సామగ్రిని సమకూర్చిన తర్వాతే ఎస్‌ఒపి నిబంధనలు అమలు చేయాలని, పూర్తి వైద్య సదుపాయం అందించాలని, కొత్త విధివిధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కొత్త పోస్టులు మంజూరు చేయాలని, 2022 పిఆర్‌సిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెఎసి నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, కాంట్రాక్ట్ కార్మికులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎంప్లాయిస్, తదితరులు పాల్గొన్నారు.
పాలకొండ: స్థానిక డివిజన్ కార్యాలయ ప్రాంగణంలో విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేపట్టిన దశల వారీ ఆందోళనలో భాగంగా మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఉద్యోగులు.జీవరత్నం, రమణమూర్తి ఆధ్వర్యాన జరిగాయి. ఈ కార్యక్రమానికి పాలకొండ డివిజన్ ఇఇ టి.గోపాలకృష్ణమూర్తి, డిఇ మోహన్‌చక్రవర్తి, ఎఎఒలు, జెఎఒలు, ఎఇలు, జెఇలు, డివిజన్ లోని అన్ని కార్మిక సంఘాల, అసోసియేషన్ల నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.










