ప్రజాశక్తి - ఆరిలోవ: అపరిష్కృత ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎపిటిఎఫ్ ఆధ్వర్యాన శుక్రవారం చినగదిలి తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఒకటో తేదీనాటికి నెలసరి వేతనాల చెల్లింపు, సిపిఎస్ రద్దు, 3, 4, 5 తరగతుల విలీనాన్ని ఆపాలని, యాప్‌ల పేరుతో ఉపాధ్యాయులపై వేధింపులు ఆపాలని, ఉపాధ్యాయులకు శాశ్వత ప్రాతిపదికన ప్రమోషన్ ఇవ్వాలని, డిఎస్‌సి ద్వారా ఉపాధ్యాయ నియామాకాలు జరపాలని, పెండింగ్‌లో ఉన్న మూడు డిఎలను వెంటనే చెల్లించాలన్న తదితర డిమాండ్లతో నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. చినగదిలి తహసిల్దారు రమణయ్యకు వినతిపత్రం అందజేసారు.కార్యక్రమంలో ఎపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర కౌన్సిలర్ శ్యామ్‌కుమార్, కార్యదర్శులు సునీత, నీరజ, దయానిధి పాల్గొన్నారు
పెందుర్తి : పాదయాత్ర సమయంలో సిఎం జగన్ ఇచ్చిన హామీలు, ఇతర ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎపిటిఎఫ్ ఆధ్వర్యంతో స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి, తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు. సంఘం మండలశాఖ అధ్యక్షుడు ఎఎకె.ఈశ్వరరావు, జనరల్ సెక్రటరీ సన్ని బాబు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ జగదీష్, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు










