ప్రజాశక్తి-బాపట్ల: ఆటో వర్కర్ల సమస్యలు పరిష్కారానికి ఆటో వర్కర్లు సంఘటితంగా పోరాడాలని బాపట్ల పట్టణ ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గొలపల పూర్ణచంద్రరావు అన్నారు. శుక్రవారం ఆటో వర్కర్ల సమస్యలపై నిరసన తెలుపుతూ బాపట్ల పట్టణంలో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్, పెట్రోల్ ధరలను పెంచేస్తూ ఆటో రంగంతో ఆడుకుంటున్నారన్నారు. ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకుంటామని కల్లబొల్లి మాటలు చెబుతూనే మరోపక్క ఆటో కార్మికులను పరోక్షంగా ప్రభుత్వం దెబ్బతీస్తోందన్నారు. ఆటో వర్కర్ల సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమం ఆగదన్నారు. బాపట్ల పాత బస్టాండ్ ఆటో స్టాండ్ నుంచి ఆరంభమైన ర్యాలీ, ఆటో ర్యాలీ అంబేద్కర్ సర్కిల్ నుంచి తిరిగి కొత్త బస్టాండ్‌కు చేరింది. కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.










