ప్రజాశక్తి -కంచరపాలెం : గడపగడపకూ ప్రభుత్వంలో వచ్చిన సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులు చేపట్టేందుకు సచివాలయాల వారీగా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులకు విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, నెడ్‌క్యాప్ చైర్మన్ కెకె.రాజు సూచించారు. బుధవారం మాధవదార మాధవస్వామి కల్యాణ మండపంలో జివిఎంసి జోనల్ కమిషనర్లు, సచివాలయం సిబ్బందితో సమీక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, జెడ్‌సిలు ఆర్‌జివి క్రిష్ణ, విజయలక్ష్మి, జివిఎంసి ఫ్లోర్‌లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ అల్లు శంకరరావు, స్టాండింగ్ కమిటీ సభ్యులు సారిపిల్లి గోవింద్, బర్కత్ అలి, కార్పొరేటర్లు కె.అనిల్‌కుమార్ రాజు, సాడి పద్మారెడ్డి, ఆళ్ల లీలావతి శ్రీనివాస్,పెద్దిశెట్టి ఉషశ్రీ, కంటిపాము కామేశ్వరి, వావిలపల్లి ప్రసాద్, రెయ్యి వెంకటరమణ, చల్లా రజిని, కె.వి.యన్ శశికళ, కోఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు, వార్డు అధ్యక్షులు పైడి రమణ, గుజ్జు వెంకటరెడ్డి, నీలి రవి, పీలా వెంకటలక్ష్మీ, మాజీ కార్పొరేటర్లు బాక్సర్ రాజు, బులుసు జగదీశ్, కె.వెంగళరావు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై అవగాహన
కంచరపాలెం : ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదుపై మాధవధార మాధవస్వామి కల్యాణ మండపంలో బిఎల్‌ఒలకుఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త,రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కెకె.రాజు ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైసిపి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ పాల్గొన్నారు.










