Jun 25,2023 20:54

ట్రెజరీ డిడి ఎం.ఎస్‌ వెంకటేశ్వర్లు వెల్లడి

కడప ప్రతినిధి : రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలను ఎప్పటికప్పుడు పరి ష్కరించుకోవాలి. ఉద్యోగులకు అందుబాటులో ట్రెజరీశాఖ ఉద్యోగు లు అందుబాటులో ఉంటారు. ఇటీవల రాష్ట్రప్రభుత్వ ఆదేశాల ప్రకా రం ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఇకెవైసి చేయించుకోవాల్సి ఉంది. సిఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థ అమలు నేపథ్యంలో ట్రెజరీస్‌ ఉన్నతాధికారుల పై అదనపు భారం పడింది. దీనికితోడు ఆర్టీసీ ప్రభుత్వ పరిధిలోకి రావడంతోపాటు త్వరలో వైద్యఆరోగ్యశాఖ కూడా ప్రభుత్వ పరిధిలో రానున్న నేపథ్యంలో మరింత భారంగా మారే అవకాశం కనిపి స్తోందని పేర్కొంటున్న ట్రెజరీస్‌ డిడి ఎం.ఎస్‌ వెంకటేశ్వర్లుతో ప్రజా శక్తి ముఖాముఖి...
సబ్‌ట్రెజరీ కార్యాలయాల వివరాలు తెలపండి?
జిల్లాలో తొమ్మిది సబ్‌ట్రెజరీ కార్యాలయాలు ఉన్నాయి. కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, ముద్దనూరు, కమలాపురం, పులివెందుల, బద్వేల్‌, సిద్ధవటం ప్రాంతాల్లో ఉన్నాయి.
ట్రెజరీ కార్యాలయాల పనులేమిటి?
జిల్లాలోని ట్రెజరీ కార్యాలయాలు ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్ల చెల్లింపులు, వాటి రికార్డులను నిర్వహించడం, కొత్తగా చేరి న ఉద్యోగులకు ఐడి, ఇతర రికార్డులను నిర్వహించడం, పీడీ అకౌ ంట్ల నిర్వహణ, స్ట్రాంగ్‌రూమ్‌ నిర్వహణ, ఆప్కోస్‌, కాంట్రాక్టు, క్లాస్‌ - 4 ఉద్యోగుల సమస్యలను పరిష్కారానికి కృషి చేయడం జరుగు తుంది.
ఇకెవైసి నమోదు ఎలా ఉంది?
జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా ఇకెవైసిపి చేయించుకోవాలి. ఇకెవైసి నమోదులో జిల్లా మద్యస్థంగా ఉంది. ఇప్పటివరకు ఉద్యోగులు 99 శాతం, పెన్షనర్స్‌ 84 శాతం నమోదు చేశాం.
ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు తెలపండి?
జిల్లాలో 28 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 18 వేల మంది పెన్షనర్స్‌ ఉన్నారు. ప్రతి నెలా సదరు ఉద్యోగుల జీతభత్యాల, పెన్షన్స్‌, వంటి ఇతర చెల్లింపులు ప్రక్రియ నడుస్తోంది. వీటితోపాటు రిటైర్డు ఉద్యోగుల బకాయిలు, గ్రాట్యూటీ చెల్లింపులను చేయడం గమనార్హం.
ట్రెజరీ చెల్లింపుల గురించి తెలపండి?
ప్రతి నెలా ట్రెజరీశాఖ ద్వారా రూ.514 కోట్లు మేర ఉద్యో గుల జీతభత్యాలు, పెన్షనర్లకు సంబందించి పెన్షన్ల రూపంలో చెల్లిం పులు చేయడం జరుగుతోంది.
పీడీ అకౌంట్ల ద్వారా చెల్లింపుల డిపార్టుమెంట్లు ఎన్ని?
జిల్లాలో 10 శాఖల వరకు ఉన్నారు. ఇందులో వైద్య ఆరో గ్యశాఖ, డ్వామా, స్పోర్ట్‌ స్కూల్‌, యూనివర్శిటీ, ఆర్కిటెక్షర్‌ యూని వర్శిటీ సహా ఇతర శాఖల పరిధిలోని ఉద్యోగులు ఉన్నారు. వీటి పరిధిలోని ఉద్యోగులకు పిడీ అకౌంట్ల ద్వారా జీతభత్యాలు చెల్లిం పులు చేయడం జరుగుతుంది.
ఆప్కోస్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఎంతమంది?
జిల్లాలో ఆప్కోస్‌ కింద 3,600 మంది, ఔట్‌సోర్సింగ్‌ కింద 1100, కాంట్రాక్టు ఉద్యోగులు 2,000 మంది వరకు ఉన్నారు.
సబ్‌ట్రెజరీ భవన నిర్మాణ పనుల గురించి చెప్పండి?
జిల్లాలో సిద్ధవటం, జమ్మలమడుగు, ముద్దనూరు సబ్‌ట్రెజరీ భవన నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ప్రతి సబ్‌ట్రెజరీ భవనానికి రూ.కోటి వ్యయంతో టెండర్లు పిలిచాం. కాంట్రాక్టర్లు ముందుకు వచ్చిన వెంటనే పనులు చేపడతాం.