Sep 11,2023 20:44

ఫొటో : అర్జీ స్వీకరిస్తున్న అధికారులు

సమస్యల పరిష్కారానికి కృషి చేయండి
ప్రజాశక్తి-వరికుంటపాడు : మండలంలోని ఎంపిడిఒ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి వివిధ రకాలైన సమస్యలపై వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు వీలైనంత తొందరగా పరిష్కారానికి కృషి చేయాలని ఎంపిడిఒ శ్రీదేవి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. స్పందనలో వచ్చే అర్జీలపై నిర్లక్ష్యం వహించకుండా పరిష్కరించాన్నారు.
కార్యక్రమంలో సర్పంచ్‌ కొండిపోకు దిలీప్‌ ఎస్‌సి, ఎస్‌టి, బిసి లబ్ధిదారులకు ఎన్‌పిఐ ద్వారా గృహ నిర్మాణాల కోసం స్థలాలు పట్టాలు మంజూరు చేయాలని అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ సయ్యద్‌ఇక్బాల్‌, మండల వైద్యాధికారిణి కరిష్మా, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.