Aug 30,2023 00:31

మహిళకు కరపత్రం ఇస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
ప్రజాశక్తి-కొయ్యూరు

మండలంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. మండలంలోని దొడ్డవరం గ్రామ సచివాలయం పరిధిలో దొడ్డవరం, తాళ్లపాలెం, లూశం, బలభద్రపాడు గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. 275 గడపలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో వైసిపి ప్రభుత్వానికి 100 మార్కులు పడుతున్నాయని తెలిపారు. పాలనలో జవాబుదారీతనాన్ని తీసుకొచ్చిన వ్యక్తి జగన్‌ అని పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిపనుల వదిలేసి చిన్న చిన్న పొరపాట్లను పట్టుకొని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్‌, జెడ్పిటిసి వారా నూకరాజు, వైస్‌ ఎంపీపీలు అప్పన వెంకటరమణ, అంబటి నూకాలమ్మ, సర్పంచ్‌ మాదల సత్యవతి, ఎంపీటీసీ పిలా గంగాభవాని, చింతపల్లి వ్యవసాయ మార్కెట్‌ చైర్‌పర్సన్‌ జైతి రాజులమ్మ, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రేగటి ముసలి నాయుడు, బిసి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ డైరెక్టర్‌ గాడి నాగమణి, మండల కన్వీనర్‌ బండి సుధాకర్‌, పలువురు వైసిపి నాయకులు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.
ఎస్‌కె.ఖాన్‌కు ఎమ్మెల్యే పరామర్శ
ప్రజాశక్తి- కొయ్యూరు
మండలం రాజేంద్రపాలెం గ్రామానికి చెందిన ఎస్‌కె.ఖాన్‌ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మంగళవారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. త్వరలోనే కొలుకుంటారు, అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. ఎటువంటి సహాయ సహకారాలు కావలసిన తాము అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బడుగు రమేష్‌, వైసిపి మండల అధ్యక్షులు జల్లి బాబులు, మార్కెట్‌ యార్డ్‌ చైర్‌పర్సన్‌ జైతి రాజులమ్మ, బిసి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గాడి నాగమణి, వైస్‌ ఎంపిపి నూకాలమ్మ, జెసిఎస్‌ కన్వీనర్‌ బండి సుధాకర్‌, ముసిలి నాయుడు, పాటి శేఖర్‌, సావిత్రి పాల్గొన్నారు.