* ఎస్‌పి జి.ఆర్ రాధిక
ప్రజాశక్తి - శ్రీకాకుళం: పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎస్‌పి జి.ఆర్ రాధిక తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ సిబ్బంది సమస్యలపై శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. పలు పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బంది వ్యక్తిగత, ఇతర సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఆయా సమస్యలపై సానుకూలంగా స్పందించి వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ నిరంతరం విధి నిర్వహణలో నిమగమైన సిబ్బంది సంక్షేమమే ప్రధాన లక్ష్యమన్నారు. వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు సిబ్బంది వారి సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే తక్షణం పరిష్కరించనున్నట్లు తెలిపారు.










