ప్రజాశక్తి-పెదబయలు:మండలంలో మారుమూల పంచాయతీ కేంద్రం గోమంగిలో శుక్రవారం ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభిం చారు. గోమాంగి, కుమ్మరివీధి, సరియపల్లి, బోయరాజుల, రాయిమామిడి గ్రామాల్లో పర్యటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసున్నారు. రాయిమామిడి గ్రామంలో వైస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.గోమాంగి సర్పంచ్ కొర్ర జట్టొ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ , గడప గడపకు వచ్చి సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి నివేదించి పరిష్కారం చేస్తామన్నారు. గోమాంగిలో మంచినీటి బోరు వెల్ , సి సి ర్యాంపునకు రూ. 40 లక్షలు విడుదల చేస్తున్నానని తెలిపారు. కుమ్మరివీధి, రాయిమామిడి, గోమాంగిలో బస్సు స్టాఫ్ నిర్మించుటకు నిధులు మంజూరు చేశారు. పథకాలు అందకుంటే గ్రామ వాలంటీర్‌లను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కూడా బొంజుబాబు, రాష్ట్ర వైసిపి కార్యదర్శి జర్సింగి సూర్యనారాయణ, మాజీ జడ్పీటీసీ కొంటా సూర్యనారాయణ, వైస్ సర్పంచ్ కూడా మఠ్య కొండబాబు, మాజీ ఎంపీపీ సల్లంగి ఉమామహేష్, మాజీ వైస్ ఎంపీపీ అప్పారావు, మాజీ సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు పాంగి సింహాచలం, ఇంజినీర్ సంజీవరావు, ఈఓఆర్‌డీఓ నరసింగరావు పాల్గొన్నారు.










