Oct 16,2022 23:43

మాట్లాడుతున్న జెడ్‌పిటిసి

ప్రజాశక్తి- హుకుంపేట: గ్రామాల్లో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని జెడ్పిటిసి రేగం మతలింగం అన్నారు. మండలం లోని మారుమూల చీకుమద్దుల పంచాయతీలో ఆదివారం జడ్పీటీసీ రేగం మత్యలింగం పార్టీ నేతలతో కలిసి పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి మత్య్సలింగం మాట్లాడుతూ, రహదారి, సిగల్‌ సౌకర్యాలకు అధికారుల ధృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. రంగారాజుపల్లి గ్రామం లోని పోతురాజు దేవాలయాని సందర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బాకూరు సదాశివా రాజు, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి నైని సత్తిబాబు, నాయకులు గెమ్మెలి కామేశ్వరరావు, గెమ్మెలి కృష్ణారావు పాల్గొన్నారు.