Sep 01,2022 23:37

అర్జీలను స్వీకరించారు కెకె రాజు

సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌
ప్రజాశక్తి-సీతమ్మధార
: ఉత్తర నియోజకవర్గ పరిధిలోని ప్రజా సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో గురువారం నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త, నెడ్‌క్యాప్‌ రాష్ట్ర చైర్మన్‌ కెకె రాజు గ్రీవెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను స్వయంగా విన్న రాజు, కొన్నింటిని సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్య పరిష్కారానికి భరోసానిస్తూ అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో 14, 43 వార్డుల కార్పొరేటర్లు కె.అనిల్‌కుమార్‌ రాజు, పి.ఉషశ్రీ, మాజీ కార్పొరేటర్‌ బాక్సర్‌ రాజు, నీలి రవి, ఆళ్ల శివ గణేష్‌, కిరణ్‌ రాజు, రాజం రాజు, వసంతల అప్పారావు, సుకుమార్‌, జ్ఞానేశ్‌, యం.గోపి, సునీల్‌, కోడూరి సుశీల, పావని పాల్గొన్నారు.