ప్రజాశక్తి-ఆదోనిరూరల్
సమస్యల పరిష్కారానికి, సంక్షేమ పథకాల అమలు తీరుకు సంబంధించి ప్రతి ఒక్కరినీ కలిసేందుకు 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్ రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని మండిగిరి పంచాయతీలో భరత్ నగర్‌లో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి పథకాల కింద అందుతున్న లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందని తెలిపారు. ఇక్కడ నెలకొన్న ట్రాన్స్‌ఫార్మర్ సమస్యను పరిష్కరించాలని విద్యుత్ ఎఇ నాగభూషణ్ ఆదేశించారు. అధికారులు, వాలంటీర్లు ప్రజలను కలిసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గ్రామంలో మురుగు సమస్య నేటికీ ఉందని, వీలైనంత వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ కామాక్షి తిమ్మప్ప, ఎంపిడిఒ గీతావాణి, ఐకెపి ఎపిఎం జనార్ధన, మండిగిరి మాజీ సర్పంచి శేషిరెడ్డి, శ్రీవిద్యా స్కూల్ వినోద్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, వైసిపి నాయకులు సాదాపురం మురళీ, కళ్లుపోతుల సురేష్, శ్రీకృష్ణదేవరాయలు, హుస్సేనప్ప పాల్గొన్నారు. కోసిగిలోని 5వ సచివాలయంలో ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు సర్పంచి అయ్యమ్మ అధ్యక్షతన 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. మండల జెసిఎస్ ఇన్‌ఛార్జీ పి.మురళీ మోహన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం 3వ సచివాలయంలో 'ఎపికి జగనే ఎందుకు కావాలి' నిర్వహించారు. ఎంపిపి ఈరన్న, ఆర్లబండ సహకార సంఘం అధ్యక్షులు నాడిగేని నరసింహులు, మండల అధ్యక్షులు బెట్టన్న గౌడ్, వైసిపి సీనియర్ నాయకులు మాణిక్యరాజు, మహేంతేష్ స్వామి, జగదీష్ స్వామి పాల్గొన్నారు.