సచివాలయం ఎదుట ధర్నా చేస్తున్న నాయకులు
సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
ప్రజాశక్తి -నెల్లూరు :20 21 డివిజన్లో మౌలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ. సిపిఎం శాఖల ఆధ్వర్యంలో 20,21సచివాలయాలు వద్ద ధర్నా నిర్వహించి, అడ్మిన్‌కు వినతి పత్రం అందజేశారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిపిఎం రూరల్ కార్యదర్శి వర్గ సభ్యులు కిన్నెర కుమార్ మాట్లాడుతూ. ఫిక్స్డ్ ఛార్జీలు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో కరెంట్ ఛార్జీల బారాలను ప్రజలపై మోపుతున్నారన్నారు. అధిక కరెంట్ చార్జీల పేరుతో తొలగించిన పింఛన్లు రేషన్ కార్డులు సంక్షేమ పథకాలు తొలగించడం అన్యాయమన్నారు. వెంటనే తొలగించిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని కోరారు.. కొండపాలెం గేటు వద్ద బాక్స్ టైప్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆగస్టు 16వ తేదీ జరిగే ప్రజా ముట్టడి కార్యక్రమం లో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శాఖా కార్యదర్శులు పోతురాజు శ్రీనివాసులు, నల్గొండ రమణయ్య, శ్రీనివాసులు, పార్టీ సభ్యులు మణి, గోప,ి డబ్బుగుంట శ్రీనివాసులు, రత్నం, ప్రజలు పాల్గొన్నారు.










