ప్రజాశక్తి-ముంచంగిపుట్టు:స్పందనలో స్వీకరించిన సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాల యంలో జగనన్న కు చెబుదాం ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్పందనలో స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు అందజేసి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఉదయం స్పందనకు హాజరైన అధికారులు మధ్యాహ్న నుండి క్షేత్రస్థాయిలో పర్యటించి సంబంధిత సచివాలయం సిబ్బందితో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఒ వి.అభిషేక్, ఐటిడిఎ సహాయ ప్రాజెక్టు అధికారి వి ఎస్ ప్రభాకర్, జిల్లా ఉద్యాన వన అధికారి ఎ.రమేష్ కుమార్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి కొండలరావు, డివిజనల్ పంచాయతి అధికారి పి.ఎస్.కుమార్, గిరిజన సంక్షేమ శాఖ డిడి ఐ.కొండలరావు, ఈఈ కె.వేణుగోపాల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జమాల్ భాషా, ఎంపిడివో ఎస్ రమేష్, తహశీల్దార్ నర్సమ్మ తదితరుల పాల్గోన్నారు.
స్పందనకు 158 అర్జీలు
జగనన్నకు చెబుదాం స్పందనకు విశేష స్పందన లభించింది. స్ధానిక మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో బుదవారం నిర్వహించిన స్పందనకు 158 ఫిర్యాదులు అందాయి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐ టి డి ఎ ,పి. ఓ వి. అభిషేక్ తో కలసి మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. తాగునీటి సమస్యలు, రహదారులు నిర్మాణాలు, భూ సమస్యలు , డ్రైనేజీ నిర్మాణాలు, సిసి రోడ్లు,మట్టి రోడ్లు నిర్మాణాలు కోసం ఫిర్యాదులు అందాయి. దోడిపుట్టు పంచాయతి కుమ్మిపుట్టు జంక్షన్ నుండి బీడిచెంప గ్రామం వరకు ఏడు కిలోమీటర్లు రోడ్డు నిర్మించాలని బీడిచెంప గ్రామస్తులు పాంగి దశరథి, పాంగి రాజు వినతి పత్రం సమర్పించారు.స్ధానిక కరెంటు ఆఫీసు వెనుక కించాయిపుట్టు గ్రామానికి మట్టి రోడ్డు నిర్మించాలని పలువురు అర్జీ పత్రం అందజేశారు. పాత ముంచంగిపుట్టు లో సి సి రోడ్డు నిర్మించాలని, పాత ముంచంగిపుట్టులో ఇల్లు మంజురు చేయాలని వినతి పత్రం సమర్పించారు. ఏనుగురాయి పంచాయతి అలడమూల గ్రామానికి సి సి రోడ్డు, మురుగు చెరువు గ్రామానికి తారు రోడ్డు మంజూరైందని దాని నిర్మాణం పూర్తి సర్పంచ్ సిరగం నరసింగరావు వినతి పత్రం సమర్పించారు.










