ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్ : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక స్పందన కార్యక్రమమని ఎస్‌పి విక్రాంత్ పాటిల్ అన్నారు. సోమవారం ఎస్‌పి కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. 9 ఫిర్యాదులు రాగా, అర్జీదారులతో ముఖాముఖి ఆయన మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని ఆదేశించారు. స్పందనలో ఫిర్యాదు చేసిన వ్యక్తి పదే పదే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉండకూడదని స్పష్టంచేశారు. బాధితులకు చట్ట పరిధిలో తక్షణ న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో దిశ డిఎస్‌పి ఎస్.ఆర్.హర్షిత, ఎస్‌బి సిఐ సిఎచ్. లక్ష్మణరావు, డిసిఆర్‌బి సిఐ ఎన్.వి.ప్రభాకరరావు, ఎస్‌ఐ పాపారావు, సిబ్బంది పాల్గొన్నారు.










