ప్రజాశక్తి - ఆదోని
విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో అలుపెరుగని పోరాటాలు కొనసాగిస్తామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా తెలిపారు. ఆదివారం స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. అనంతరం ఆదోని పట్టణ నూతన కమిటీని 18 మంది సభ్యులతో ఎన్నుకున్నారు. నూతన పట్టణ కమిటీ అధ్యక్షులుగా భరత్, కార్యదర్శి శ్రీనివాసులు, పట్టణ ఉపాధ్యక్షులుగా గౌస్, నాగరాజు, గణేష్, పట్టణ సహాయ కార్యదర్శులుగా పవన్, శశిధర్‌తోపాటు 12 మంది కమిటీ సభ్యులతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడారు. పట్టణంలో డిగ్రీ కళాశాల భవనం కోసం, నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా, ఎయిడెడ్ విద్యా సంస్థల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా, స్థానిక విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, నాయకులు రాజు, గణేష్, రాజు, ఉదరు కిరణ్ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు










