Nov 16,2022 22:45

ప్రజాశక్తి - తిరువూరు
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలని సిఐటియు ఎన్‌టిఆర్‌ జిల్లా ప్రధానకార్య దర్శి ఎన్‌సిహెచ్‌. శ్రీనివాస్‌ పిలుపుని చ్చారు. సిఐటియు తిరువూరు మండల 4వ మహాసభ తిరువూరు ఆర్యవై శ్య కళ్యాణ మండపంలో ఎస్వీ.భద్రం, నాగమణి ల అధ్యక్షత బుధవారం జరిగింది. ఈసందర్భంగా శ్రీనివాస్‌ మాట్లా డుతూ కార్మికులకు కనీస వేతనాలు, చట్టపరమైన హక్కుల సాధన కోసం, ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయించు కునేందుకు ఐక్య ఉద్యమానికి సిఐటియు సన్నద్ధం చేస్తుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపై యుద్ధం చేస్తున్నాయని, కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకు మోడీ లేబర్‌ కోడ్స్‌ తెచ్చారన్నారు. లేబర్‌ కోడ్స్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశా రు. బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటి యు) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సీ తారాములు మాట్లాడుతూ పోరాడి సంక్షేమ బోర్డును సాధించుకుంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సంక్షేమ బోర్డును నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో భవన నిర్మాణ కార్మికు లకు ఎటువంటి ఆధారం లేదన్నారు. క్లైయిమ్‌ లు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సంక్షేమ బోర్డును కాపాడుకునేందుకు ఐక్యంగా పోరా డాలని పిలుపునిచ్చారు. సిఐటియు కార్మికుల సమస్యలపై పోరాడుతుంద న్నారు.
నూతన కమిటీ ఏకగ్రీవం
అనంతరం సిఐటియు మండల నూత న కమిటీని మహా సభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ప్రధానకార్యదర్శిగా బి.వెంకటేశ్వరరావు తిరిగి ఎన్నికవ్వగా అధ్య క్షుడుగా మారకాల ఇజ్రాయేల్‌, ఉపా ధ్యక్షులుగా సిహెచ్‌. నాగరాజు, నిర్మల, సహాయ కార్యదర్శిగా కోట నాగమణి, కోశాధికారిగా కె.వెంకటేశ్వరరావు కమి టీ సభ్యులుగా ఎస్వీ.భద్రం, బాబు, సురేష్‌, పుల్లారావు, అమ్ములు, పంతం గి శ్రీనివాసరావు, అరుణ్‌ కుమార్‌, ముత్తమ్మ, ఆకుల రామారావు తది తరులు ఎన్నికయ్యారు.