ప్రజాశక్తి-చీరాల: విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించే వాటినే సత్వరమే పరిష్కరించేందుకే క్షేత్రస్థాయిలో అధికారులు విద్యుత్తు అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా సెషన్స్ జడ్జి విక్టర్ ఇమ్మానియేల్ పేర్కొన్నారు. ఏపీ మధ్య ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ విద్యుత్తు వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక- విజయవ వారి ఆధ్వర్యంలో చీరాల డివిజన్ విద్యుత్తు వినియోగదాల ఆదాలత్‌ను గురువారం చీరాల్లో నిర్వహించారు. పట్టణం లోని పాపరాజుతోటలో ఉన్న ఎస్ రంగనాయ కులు, బాపనమ్మ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇమ్మానియేల్ విచ్చేశారు. ఈ సందర్భంగా చీరాల డివిజన్ పరిధిలోని వినియోగదారుల నుంచి సమస్యలను తెలుసుకుని వాటిని అర్జీల రూపం లో అందుకున్నారు. ఈ సందర్భంగా ఇమ్మానియేలుతో పాటు ఈఈ సూర్యప్రకాష్ తదితరులు మాట్లాడారు. విద్యుత్తు సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్తు శాఖ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. వినియోగదారులు కూడా విద్యుత్తు శాఖ నియమాలు, నిబంధనలు పాటించి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సంకేతిక సభ్యులు కె వెంకటకృష్ణ, ఆర్థిక సభ్యులు ఎ రాందాస్, స్వతంత్ర సభ్యులు ఎ సునీత, డీఈ శ్రీనివాసరావు, ఏఈలు, విద్యుత్తు అధికారులు, సిబ్బంది చీరాల, వేటపాలెం, పర్చూరు సబ్ డివిజన్ పరిధిలోని వినియోగదారులు పాల్గొన్నారు.










