Nov 16,2023 20:28

సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు

ప్రజాశక్తి - చిప్పగిరి
'జగనన్నకు చెబుదాం, స్పందన' ద్వారా వచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తహశీల్దార్‌ లక్ష్మీనారాయణ, ఇఒఆర్‌డి బాలన్న తెలిపారు. గురువారం చిప్పగిరి సచివాలయ కార్యాలయంలో 'జగనన్నకు చెబుదాం, స్పందన'ను సర్పంచి గోవిందరాజులు ఆధ్వర్యంలో నిర్వహించారు. రైతు భరోసా నిధులు రావడం లేదని ఒక రైతు సమస్యను వివరించారు. వెంటనే స్పందించిన ఎఒ జయలక్ష్మి రైతు సమస్యను పరిశీలించగా కుటుంబంలో చనిపోయిన వ్యక్తి పేరు కనిపిస్తుందని, అధికారులతో ధ్రువీకరించిన మరణ ధ్రువపత్రాన్ని రైతు భరోసా దరఖాస్తుకు జత చేసి పంపిస్తామని, రైతు భరోసా డబ్బులు కూడా వస్తాయని తెలిపారు. సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసరావు, ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ ప్రసూన, వెటర్నరీ డాక్టర్‌ ప్రసన్న బారు పాల్గొన్నారు.