Oct 20,2023 21:21

సిబ్బంది సమస్యలు తెలుసుకుంటున్న ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌

         ప్రజాశక్తి -అనంతపురం క్రైం    పోలీసులు, పోలీసు కుటుంబ సభ్యుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు గ్రీవెన్స్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కెఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు. శుక్రవారం పోలీస్‌ గ్రీవెన్స్‌ నిర్వహించి పోలీసు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం ముఖాముఖిగా సిబ్బంది సమస్యలు విన్నారు. సాయంత్రం జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా దర్బార్‌ నిర్వహించి కింది స్థాయి సిబ్బంది నుంచి అధికారుల వరకూ ఎదుర్కొంటున్న సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ఆయా సమస్యలకు చట్టపరిధిలో పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఆర్‌.విజయభాస్కర్‌రెడ్డి, ఎం.హనుమంతు (ఏఆర్‌), డీపీఓ ఏఓ శంకర్‌, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్‌ కమిటీ సభ్యులు సాకే త్రిలోకనాథ్‌, సుధాకర్‌రెడ్డి, గాండ్ల హరినాథ్‌, తేజ్‌పాల్‌, శ్రీనివాసులునాయుడు, శివప్రసాద్‌, ఎస్పీ సీసీ ఆంజనేయప్రసాద్‌, ఆయా పోలీసు స్టేషన్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.