Jul 25,2023 22:36

కొత్తూరు : ధ్రువపత్రాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి

ప్రజాశక్తి- మెళియాపుట్టి: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు జగనన్న సురక్ష కార్యక్రమం దోహదపడుతుందని ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. మండలంలోని పెద్దపద్మాపురంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన ధ్రువపత్రాలు పంపిణీతో పాటు సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకం అందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి గూడ ఎండయ్య, ఎంపిపి ప్రతినిధి బి.ఉదరుకుమార్‌, పిఎసిఎస్‌ అధ్యక్షులు బాలరాజు, మండల కన్వీనర్‌ పల్లి యోగి, తహశీల్దార్‌ పి.సరోజని, ఎంపిడిఒ పి.చంద్రకుమారి, ఎంఇఒ ఎం.పద్మనాభం, మండల ఎఒ దానకర్ణుడు, ఎపిఎం లలిత పాల్గొన్నారు.
కొత్తూరు : మండలంలోని సోమరాజపురంలో నిర్వహించిన జగనన్న సురక్షలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాల్గొని లబ్ధిదారులకు 11 రకాల ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జెడ్‌పి టిసి కె.భాగ్యవతి, వైస్‌ ఎంపిపి మెండ సుమతి, పిఎసిఎస్‌ చైర్మన్‌ చింతాడ సూర్యనారాయణ, ఇఒపిఆర్‌డి కృష్ణారావు, వైసిపి నాయకులు గండివలస ఆనందరావు, లోతుగెడ్డ తిరుపతిరావు, బి.శ్రీను, సర్పంచ్‌ పి.సాధుబాబు పాల్గొన్నారు.
జలుమూరు: మండలంలోని తిమడాం, శ్రీముఖలింగం సచివాలయాల్లో ఎంపిపి వాన గోపి అధ్యక్షతన నిర్వహించిన జగనన్న సురక్షలో పోలాకి జెడ్‌పిటిసి ధర్మాన కృష్ణచైతన్య పాల్గొని లబ్ధిదారులకు వివిద రకాల ధ్రుపత్రాలను అందజేశారు. శ్రీముఖలింగంలో ఇంటింటికీ తాగునీరు అందించేందుకు జలజీవన్‌ మిషన్‌లో భాగంగా చేపడుతున్న పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం మండల వైసిపి కన్వీనర్‌ కనుసు సీతారాం, వైస్‌ ఎంపిపి తంగి మురళీకృష్ణ, మండల సలహాదారుడు పైడి విఠల్‌రావు, తహశీల్దార్‌ బి.సత్యం, ఎంపిడిఒ ఎల్‌.వి.అప్పారావు, ఇఒపిఆర్‌డి పి.ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
వజ్రపుకొత్తూరు : జగనన్న సురక్షతో ప్రజలకు మేలు చేకూరుతుందని జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ ప్రతినిధి పాలిన శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని పాతటెక్కలి సచివాలయం ఆవరణలో సర్పంచ్‌ తుంగాన సుశీల, ఎంపిటిసి బాలల శ్రీను ఆధ్వర్యాన నిర్వహించిన జగనన్న సురక్షలో పాల్గొని వివిధ రకాల ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులు దువ్వాడ మధుకేశ్వరరావు, నాయకులు దాలయ్య, జోగారావు, చింత హేమారావు, ఎంపిడిఒ ఈశ్వరమ్మ, డిటి గిరిరాజు పాల్గొన్నారు.