ప్రజాశక్తి - నిజాంపట్నం : సమస్యల పరిష్కారానికే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు తెలిపారు. మండల పరిధిలోని అడవులదీవి గ్రామ సచివాలయం వద్ద జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఎంపీ మోపిదేవి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించాలన్న లక్ష్యం, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. గతంలో సాంకేతిక సమస్యల కారణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని లబ్ధిదారులకు ఇది ఒక మంచి అవకాశమన్నారు. ఇంకా ఎవరైనా అర్హులు ఉండి సంక్షేమ పథకాలు అందక పోతే వారిని వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది గుర్తించి నేరుగా వారి ఇంటింటికి సందర్శించి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు మోపిదేవి హరనాథ్ బాబు, జడ్‌పిటిసి నర్రా సుబ్బయ్య, డిసిఎంఎస్ చైర్మన్ భాగ్యలక్ష్మి మదన్, ఎంపిటిసి నాజర్ ఖాన్, సర్పంచి శొంఠి శ్రీనివాసరావు, ప్రసాదం వాసుదేవ, వైసిపి నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.నగరం : సమస్యల పరిష్కారానికే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపిపి చింతల శ్రీకష్ణయ్య తెలిపారు. మండల పరిధిలోని బోరమాదిగపల్లి గ్రామ సచివాలయం వద్ద జగనన్న సురక్ష కార్యక్రమం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఎంపిపి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించాలన్న లక్ష్యంతో పాటు ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సాంకేతిక సమస్యల కారణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని లబ్ధిదారులకు ఇది ఒక మంచి అవకాశమన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు ఎం. శ్రీనివాసరావు ,గ్రామ పంచాయితీ సర్పంచి చందోలు దేవదాసు, ఎంపిటిసి నల్లూరి శ్రీమన్నారాయణ, ఉపసర్పంచి రత్నబాబు, వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు










